Saturday, May 4, 2024
- Advertisement -

నిర్మలా కాన్వెంట్ రివ్యూ

- Advertisement -

తెలుగు సినిమా రంగంలో హీరో శ్రీకాంత్ కి చాలా గొప్ప పేరే ఉంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదట్లో విలన్ గా చాలా పాత్రలు చేసిన శ్రీకాంత్ తరవాత కాలం లో మంచి పేరు తెచ్చుకున్నాడు. వివాదాలకి దూరంగా ఉండడం లో శ్రీకాంత్ కి పెట్టింది పేరు.

చిరంజీవి కి ప్రాణ ప్రదమైన తమ్ముడు గా ఎప్పుడూ ఆయన అభిమానిగా ఉంటూ ఉండే శ్రీకాంత్ ఇప్పుడు తన కొడుకు రోషన్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన నిర్మలా కాన్వెంట్ విడుదల కి సిద్దం అయ్యింది. దీని రిజల్ట్ ఎలా ఉందొ చూద్దాం. 

కథ – పాజిటివ్ లు

భూపతి నగరం ఊర్లో 99 ఎకరాల ఆసామి అయిన రాజుగారికి ఒక ఎకరం ఉన్న వీరయ్య (ఎల్.బి.శ్రీరాం)కు పడదు. అందుకు తన కులపోళ్లను గుడిలోకి అనుమతించకపోవడం, చెరువు నీళ్ళు తాగనీయకపోవడం వంటి కారణాలుంటాయి. అంతే కాకుండా రాజుగారి పొలానికి కావాల్సిన నీళ్ళు వీరిగాడి పొలం నుండే రావాలి. అందుకు వీరయ్య పేచీ పెడుతుంటాడు. దాంతో ఊర్లో జరిగే ఉత్సవాల సమయంలో వీరయ్యను, రాజుగారు మనుషులు చంపేస్తారు.

వీరిగాడు చనిపోతు కొడుకు సూరయ్య(సూర్య)తో ఆ ఎకరం పొలం ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదంటూ మాట తీసుకుని చనిపోతాడు. తండ్రి మరణం తర్వాత సూరయ్య క్రిస్టియన్ మతంలోకి మారిపోయి డేవిడ్ అని పేరు మార్చుకుంటాడు. మేరి(అనితా చౌదరి)ని పెళ్ళి చేసుకుంటాడు.

డేవిడ్, మేరిల కొడుకు శామ్యూల్స్(రోషన్). రాజుగారి కొడుక్కి (ఆదిత్యమీనన్) కూడా కూతురు పుడుతుంది. ఆమె పేరే శాంతి(శ్రియాశర్మ). శామ్యూల్స్ చదువుల్లో ఫస్ట్ అంతే కాకుండా తన చుట్టూ పక్కల జరిగే విషయాలపై మంచి అవగాహనతో, నాలెడ్జ్ తో ఉంటాడు. శామ్యూల్స్, శాంతి మధ్య ప్రేమ పుడుతుంది. దాని వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? అసలు శామ్యూల్స్ హైదరాబాద్ వచ్చి నాగార్జున అక్కినేనికి చాలెంజ్ ఎందుకు విసురుతాడు? చివరకు శామ్యూల్, శాంతిల ప్రేమ గెలిచిందా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…. ఈ సినిమాకి హై లైట్ అంటే నాగార్జున అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో వచ్చిన నాగార్జున తన ఎంట్రీ తోనే థియేటర్ లో అరుపులు పుట్టించాడు.

మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో నాగార్జున థియేటర్ లలో నే టీవీ అనుభూత్ ని డీటీ ఎస్ లో ఇచ్చాడు. ఆయన తరవాత ఈ సినిమాలో ఆకట్టుకునేది హీరో రోషన్. తండ్రి లాగానే కనిపిస్తూ చాలా అద్భుతమైన నటన చేసాడు. కొత్త హీరో అని అనుకునే ఫీలింగ్ ఎక్కడా కనిపించకుండా రోషన్ చాలా పర్ఫెక్ట్ గా చేసాడు. ఒక్క చోట కూడా తొణకలేదు . యాక్షన్ సీన్స్ లో , వార్నింగ్ లు ఇస్తూ ఎంతబాగా చేసాడో అంతే క్యూట్ గా లవ్ సీన్స్ లోనూ కనపడ్డాడు. హీరోయిన్ బాగానే చేసింది ఇతర పాత్రధారులు పర్లేదు అనిపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. సినిమాటో గ్రఫీ అదుర్స్ అని చెప్పాలి. పాటలు బాగా రావడానికి ఇదే కారణం అయ్యింది .

నెగెటివ్ లు :

ఈ సినిమాకి అతిపెద్ద నెగెటివ్ పాయింట్ ఏంటంటే కథ అని చెప్పాలి. పూర్తిగా పాత కథని తీసుకుని డైరెక్టర్ దాన్ని ఇంకా పాతగా చెప్పడం తో జనానికి విసుగు ఒస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా అయితే అసలు చాలా సహనం కావాలి. సెకండ్ హాఫ్ కూడా అంతేగానీ నాగార్జున అడపా దడపా కనపడుతూ కాస్త ఉత్సాహం ఇస్తాడు. ఎంటర్టైన్మెంట్ అనే పదమే సినిమాలో కనపడదు. హీరో హీరోయిన్ ల మధ్యన కెమిస్ట్రీ బాగానే ఉంది కానీ వారిద్దరూ అసలు లవర్స్ అంటే నమ్ముద్ది కాదు.

మొన్న మొన్నటి వరకూ పిల్లలుగా చూసిన వీరిద్దరూ అప్పుడే హీరోయిన్ హీరో మెటీరియల్ అంటే నవ్వొస్తుంది కూడా. అది చాలా పెద్ద మైనస్ అయ్యింది. అక్కడక్కడా లాజిక్ లు బాగా మిస్ అయ్యాయి.

మొత్తంగా :

మొత్తంగా చూస్తే నిర్మలా కాన్వెంట్ ఇప్పటికే ఎన్నోసార్లు తెరమీద మనం చూసేసిన ఒక పాత కథ. దాన్ని డైరెక్టర్ కొత్తగా చెప్పి ఉండాల్సింది కానీ అతను ఇంకా పాతగా చెప్పడం మీదనే దృష్టి పెట్టాడు ఎందుకో మరి. ఫస్ట్ హాఫ్ ని ఆసక్తికరంగా తీయడం లో పూర్తిగా ఫెయిల్ అయిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని పరవాలేదు అన్నట్టు ముగించాడు.

ఓ తెలివైన కుర్రాడు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం లెటెస్ట్ వెర్షన్ లాంటి చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ చుట్టూనే తిరుగుతుంది. సెకండాఫ్ చూస్తుంటే స్లమ్ డాగ్ మిలియనీర్ స్తున్నట్టపిస్తుంది కానీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో దర్శకుడు విఫలయ్యాడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ ది టీనేజ్ లవ్ స్టోరీ, ముద్దుల గొడవ యూత్ పాడవుతుందనిపిస్తుంది కానీ కొత్తగా చెప్పిందేమీ లేదు. ఇందులో నాగార్జునకు నచ్చిందేమిటో ఆయనే చెప్పాలి. మొత్తం మీద  నిర్మలా కాన్వెంట్ సినిమాను నాగార్జున కోసం, రోషన్ కోసం ఓసారి చూడవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -