ఏపీకి ప్రత్యేక హోదా కు మంగళం పాడి ప్రత్యేక ప్యాకేజి ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు.
కేంద్రం ఇచ్చే ప్యాకేజి పిండాకూడు లావుందని దానికి కక్కుర్తి పడొద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు. కేద్రం ఇచ్చే ప్యాకేజీకి చంద్రబాబు ఒకే చెబితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీ చేస్తే టిడిపి కి ఉంత్తరాంద్రలో చిప్ప ఖాయం అని జ్యోస్యం చెప్పారు. కాగా విశాఖను కాదని విజయవాడని రైల్వే జోన్ గా కేద్రం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శివాజీ దీనిపై స్పందించారు. విజయవాడను రైల్వే జోన్ గా ప్రకటిస్తే వివాదాలు ఏర్పడే అవకాలం ఉందని హెచ్చరించారు. విశాఖనే రైల్వే జోన్ కు అన్ని విధాలా అనుకూలం అని అన్నారు.
Related