దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులతో పాటు సినీ వర్గాలనూ కోవిడ్-19 వదలం లేదు. ఇటీవల టాలీవుడ్‌లో నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, నటి నివేదిత థామస్ కరోనా బారిన పడ్డారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కథానాయకుడి నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి అంజలి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు కరోనా సోకిందనీ, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపింది. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలనీ, ఇటీవల తనను కలిసిన వారు సైతం కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
కాగా, వకీల్ సాబ్ మూవీలో నటించిన మరో హీరోయిన్ నివేదితా థామస్ సైతం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దూరంగా ఉన్నారు. అయితే, అంజలి మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ నేపథ్యంలోనే వకీల్‌సాబ్ చిత్ర యూనిట్‌తో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టెన్షన్ కు గురవుతున్నారు. కొందరూ ఇప్పటికీ కరోనా పరీక్షలకు శాంపిళ్లు ఇచ్చినట్టు సమాచారం.
ఢిల్లీని వీడుతున్న ప్రజలు.. ఎందుకంటే..?
పవర్ స్టార్ కొత్త సినిమా పేరు ఇదే !
రెండు డోసులు తీసుకున్న 40 డాక్టర్లకు కరోనా