ఢిల్లీని వీడుతున్న ప్ర‌జ‌లు.. ఎందుకంటే..?

- Advertisement -

దేశ రాజ‌ధాని ఢిల్లీ అనుకోని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అంశం దేశంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదేంటంటే.. ఢిల్లీని అక్క‌డి ప్ర‌జ‌లు వీడి.. సొంతూళ్ల‌కు ప‌య‌న‌మై పోతున్నారు. ఎక్క‌డ చూసిన మ‌ళ్లీ ఖాళీ గృహాలే క‌నిపిస్తున్నాయి. జ‌నాల‌తో ప్ర‌యాణ ప్రాంగ‌ణాలు, బ‌స్ స్టేష‌న్లు కిట‌కిట‌లాడుతున్నాయి. దీనిని ప్ర‌ధాన కార‌ణం క‌రోనాయే. గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీ స‌ర్కారు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు విధించింది. క‌రోనా ప్ర‌భావం ఇలాగే పెరుగుతూ పోతే లాక్‌డౌన్ విధిస్తారనే వార్త‌లు నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో అక్క‌డ ప్ర‌జ‌లు ఢిల్లీని వీడుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌లే ఢిల్లీకి చేరిన వ‌ల‌స కార్మికులు మ‌ళ్లీ సొంత గ్రామాల‌కు వెళ్తున్నారు.

- Advertisement -

అక‌స్మికంగా గ‌తేడాది మాదిరిగా లాక్ డౌన్ విధిస్తే తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని భావిస్తున్న వ‌ల‌స జీవులు ముందుగానే సొంతూర్ల‌కు వెళ్తున్నారు. గ‌తేడాది లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు తాము ప‌డిన బాధ‌లు, ఇబ్బందులు మ‌ళ్లీ ఎదురుకాకుండా ఉండేందుకే ముందుగానే త‌మ స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లిపోతున్నామ‌ని బీహార్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్ స‌హా ప‌లు రాష్ట్రాల‌కు చెందిన వ‌ల‌స జీవులు పేర్కొంటున్నారు. దీంతో ఎటు చూసిన ఢిల్లీ ప్ర‌యాణ ప్రాంగ‌ణాలు జ‌నాల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.

పవర్ స్టార్ కొత్త సినిమా పేరు ఇదే !

రెండు డోసులు తీసుకున్న 40 డాక్ట‌ర్ల‌కు క‌రోనా

మారుతి డైరెక్ష‌న్‌లో రవితేజ మూవీ !

ఈ ‘పుడింగి నెంబర్ 1’ ఆ ఇద్ద‌రితో ఏం చేస్తాడో మ‌రి !

జింద‌గీ కొత్తగా న‌వ్వుతోందంటున్న’ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -