గోదావరిలో ఘోర ప్రమాదం చోటు చేసకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిలో విహారానికి వెళ్లిన లాంచీ మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాద సంయలో లాంచీలో 60 మంది ప్రయానీకులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం నుంచి కొండమొదలు వెల్తుండగా..దేవీపట్నం మండలం మంటూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసకుంది.
రంపచోడవరం మన్యం ప్రాంతం పరిధిలో ఈ ఘటన జరగడంతో సమాచారం తెలియడంలో కొంత జాప్యం నెలకొంది. దేవీపట్నానికి చెందిన అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. నాలుగు రోజుల క్రితమే గోదావరిలో లాంచీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరవకముందే అదే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
లక్ష్మీవెంకటేశ్వర సర్వీసస్కు చెందిన లాంచీ పోలవరం విహారానికి వెల్లి సుడిగాలిలో చిక్కుకోవడంతో పడవ మునిగినట్లు స్థానికులు చెబుతున్నారు. 20 మంది ప్రయీణికులు ఒడ్డుకు చేరుకున్నారు. 40 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
ఈ ప్రమాదంతో దేవీ పట్నం పోలీసులకు లాంచీ నిర్వాహకుడు ఖాజా లొంగిపోయాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక గిరిజనులు నాటుపడవలో ప్రమాదస్థలికి వెళ్లి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ లాంచీలో పెళ్లి బృందం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.