Wednesday, April 24, 2024
- Advertisement -

తెలంగాణ వైపు చూస్తున్న ఏపీ గ్రామాలు !

- Advertisement -

ఇటీవల భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగి భద్రాచల పరిసర ప్రాంతాలలో వరదలు ముంచెత్తాయి. దాంతో పోలవరం ముంపు గ్రామాల సమస్య మళ్ళీ తెరపైకి వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మద్య రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్ర విభజన టైంలో తెలంగాణలోని భద్రాచలం పరిసరాల్లో ఉండే 7 గ్రామాలను అధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. అందులో అయిదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, ఏటపాక, గుండాల, కన్నాయిగూడెం వంటి గ్రామాలు భద్రాచలం కు అనుకోని ఉండడంతో ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలోనే కలపాలని గత కొన్నేళ్లుగా ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. .

అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ గ్రామాలను తెలంగాణలోనే కలపాలని వాదిస్తున్నాయి. ఇక తాజాగా భద్రాచలం పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో మరో సారి ఈ అయిదు గ్రామాల సమస్య తెరపైకి వచ్చింది. ఈ అయిదు గ్రామాలలో అధ్రపదేశ్ ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని తెలంగాణ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆ అయిదు గ్రామాలకు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వమే అండగా నిలుస్తోందని, టి‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక తాజాగా ఆ గ్రామాల ప్రజలు కూడా తమ గ్రామాలను తెలంగాణలోనే కలపాలని ప్ల కార్డ్స్ పట్టుకొని నిరసనల బాటా పడుతున్నారు. ఇంతకీ ఆ అయిదు గ్రామాలు తెలంగాణ వైపు చూడడానికి ప్రధాన కారణం.. భద్రాచలం నియోజక వర్గం కేవలం పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండడమే.

కానీ ఏపీ లో ఉండడంవల్ల ఆ గ్రామాల నియోజిక వర్గం అయిన రంపచోడవరం దాదాపుగా 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏవైనా నియోజిక వర్గ కేంద్రాలకు ప్రజలు వెళ్లవలసి వచ్చినప్పుడు చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. అంతే కాకుండా అక్కడికి వెళ్లాలంటే ఘాట్ రోడ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం వల్ల తెలంగాణలోని నియోజిక వర్గ కేంద్రమైన భద్రాచలం ఆ గ్రామాలకు చాలా దగ్గరౌతుంది. అందువల్లే ఆ గ్రామాల ప్రజలు.. తమ గ్రామాలను తిరిగి తెలంగాణలోనే కలపాలని గత ఎనిమిదేళ్ళ నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి తాజాగా వరదల కారణంగా మళ్ళీ తెరపైకి వచ్చిన ఈ గ్రామాల సమస్యపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read

బీజేపీ ” ఆకర్ష్ ” ఫెల్ .. టి‌ఆర్‌ఎస్ లోకి ?

జమిలి ఎన్నికలపై.. మోడి సర్కార్ దృష్టి !

“గడప గడపకు ” జగన్ కు సమస్యేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -