Thursday, May 2, 2024
- Advertisement -

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 150 మంది గల్లంతు!

- Advertisement -

ఈ మద్య రోడ్డు ప్రమాదాలు మాత్రమే కాదు.. ఆకాశం, సముద్ర మార్గాల్లో సైతం ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. నైగ‌ర్ న‌దిలో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోవ‌డంతో సుమారు 150 మందికిపైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. అయితే పడవలో సామర్థ్యం కంటే ఎక్కువ ప్రయాణికులు ఎక్కించారని నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ స్థానిక మేనేజర్ యూసుఫ్ బిర్మా మీడియాకు వెల్లడించారు.

తాము 20 మందిని రక్షించామని, నలుగురు మరణించారని, మిగిలిన 150 మంది గల్లంతు అయ్యారని ఆయన తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో పడవలో సామ‌ర్థ్యానికి మించి 180 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని గాస్కి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అబ్దుల్లాహి బుహారి వారా తెలిపారు.

నదిలో ప్రమాదానికి గురైన పడవ పాతదని, ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించారని ఆయన తెలిపారు. మాలేలోని మార్కెటుకు ప్రయాణికులు వెళుతుండగా ఈ పడవ ప్రమాదం జరిగింది. కాగా, నైజీరియా దేశంలోని ఇలాంటి పడవ ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి.

మేఘా నేను సైతం: తమిళనాడు వ్యాప్తంగా 2500 పడకల కోవిడ్ ఆసుపత్రులు

భర్తపై అలా కామెంట్స్ చేసిన యాంకర్ సుమ…?

బయటకు కనిపించేవి నిజాలు కావు.. గుట్టు విప్పిన సురేఖా వాణి కూతురు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -