Thursday, May 8, 2025
- Advertisement -

బయటపడిన కోడెల మరో లీల… కేసు నమోదు..ఈ సారి ఏటంటే…?

- Advertisement -

మాజీ స్పీకర్ కోడెల లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను నేనె తీసుకెల్లానని ఒప్పుకున్న ఆయనపై మరో కేసు నమోదయ్యాంది.2017లో 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ మాయమయ్యాయని.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారి బాజిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

2017లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు సంబంధించిన 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ మాయం అయ్యాయని తమకు ఫిర్యాదు అందిందన్నారు సీఐ. 2017లో కోడెల శివ ప్రసాదరావు కుమారుడు శివరాం ఆదేశాలతో ఎస్వీఆర్ కాలేజీకి తరలించారనే సమాచారం ఉందని అయితే అవి ఎక్కడ ఉన్నాయో తెలియదన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారుల నుంచి కొంత సమాచారం సేకరించామని.. ఫిర్యాదుపై ఆరా తీస్తున్నామని.. త్వరలోనే ల్యాప్‌టాప్‌లు ఎక్కుడున్నాయో బయటకు తీస్తామంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కోడెల కుటుంబంపై వరుసగా పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కోడెల కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -