- Advertisement -
ఏపీలో రాజకీయాలలో ట్విష్ట్‌ల ట్విష్ట్‌లు చోటు చేసకుంటున్నాయి. ప్రత్యేకహోదా విషయంలో మిత్రపక్షాలమధ్య ఉన్న బంధం దాదాపు సగం తెగిపోయిందనే చెప్పాలి. రాష్ట్రంలోనూ , కేంద్రంలోనూ ప్రభుత్వంలో ఉన్న ఇరు పార్టీ మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. ఉదయమే మంత్రులు మాణిక్యాల్ రావు, కామినేనిలు రాజీనామాలేఖలను చంద్రబాబుకు, గవర్నర్‌కు ఇచ్చారు.
ఇదిలా ఉంటే టీడీపీ కేంద్రంలో కూడా పార్టీనుంచి ఉన్న మంత్రులు ఆశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు ప్రధాని నరేంద్రమోదీనికలసి రాజీనామాలను సమర్పించారు. తాజాగా ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు చంద్రబాబుకు సమాచారం అందినట్టు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని, దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు సమర్థంగా పనిచేశారని చంద్రబాబు ప్రశంసించడం విదితమే.