Tuesday, May 21, 2024
- Advertisement -

చిన‌బాబు అవినీతి బాగోతాల‌పై స‌ర్కార్‌ ఫోక‌స్‌

- Advertisement -

నారా లోకేష్ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై వ‌రుస ట్వీట్ల‌తో జోరు పెంచారు. చంద్రబాబు హయాంలోని అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణకు రంగం సిద్ధం చేస్తూ ఉండగా.. లోకేష్ తెగ స్పందించేస్తూ ఉన్నారు. రాజ‌కీయాల్లో ఓన‌మాలు కూడా నేర్చుకోని లోకేష్ దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు. పొర‌పాటున ఈసారి టీడీపీ అధికారంలోకి వచ్చింటే సీఎం రేసులో ఉండేవారు. కాని పోటీచేసిన సొంత నియోజ‌క వ‌ర్గంలోనె ఓడిపోయారు.

జగన్ ను ఏవన్ అని – విజయసాయి రెడ్డిని ఏ టు అంటూ పాత డైలాగులే వల్లె వేస్తూ ఉన్నాడు లోకేష్. ఇవే మాటలను మీడియా ముందుకు వచ్చి లోకేష్ చెప్పే స‌హాసం చేయ‌లేడు. ఎంత సేపు ట్విట్ట‌ర్ లో స్పందిస్తుంటారు. ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడ‌పోయినా నీతి నిజాయతీ గురించి మీరా మాట్లాడేది అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మీ బాబు మా బాబూ అంటూ ఏవేవో అ సవాళ్ళు విసురుతున్నారు.

చంద్రబాబు అన్న మాట ఎపుడూ నిలబెట్టుకోలేదు. ఏడాది పాటు జగన్ సర్కార్ మీద విమర్శలు చేయం, మౌనంగా ఉంటామని చెప్పిన వారే ఇపుడు గట్టిగా నెలరోజులు కాకుండానే రంకెలు వేస్తున్నారు. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ ఆస్త్రాల‌ను బ‌య‌ట‌కు తీస్తోంది.

లోకేష్ నిర్వహించిన ఐటీ పంచాయతీ రాజ్ శాఖల అవినీతి గురించి క్షుణ్ణంగా పరిశీలనలు సాగుతూ ఉన్నాయని సమాచారం. ప్రత్యేకించి భూముల కేటాయింపు అంచనాల పెంపు.. ఈ రెండు అంశాల గురించినే కసరత్తు సాగుతూ ఉందని సమాచారం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపుల అంశం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఈ భూ కేటాయింపుల లెక్క‌లు బ‌య‌ట‌కు తీస్తున్నారు అధికారులు.

విశాఖ‌లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో అతి భారీగా ఖర్చు చేయడం కూడా వివాదాస్పదంగానే ఉంది. ఖర్చు భారీగా పెట్టినా అందుకు సంబంధించిన ఫలితాలు అక్కడేమీ లేవని.. అదంతా పెద్ద స్కామ్ అనే ఆరోపణలున్నాయి. దీంతోనే లోకేష్ మీద యుధ్ధం ప్రకటించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -