Sunday, May 11, 2025
- Advertisement -

మంత్రి కిడారి శ్రావ‌ణ‌కు భారీగా భ‌ద్ర‌త పెంచిన ఏపీ ప్ర‌భుత్వం…

- Advertisement -

మావోయిస్టుల చేతిలో హ‌త్య‌కు గుర‌యిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు కొడుకు శ్రావ‌ణ్‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం భారీగా భ‌ద్ర‌త‌ను పెంచింది. ఇటీ వ‌లే మంత్రిగా శ్రావ‌ణ్ ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఏజెన్సీ ప్రాంతం కావ‌డంతో మంత్రికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు ఆక్టోపస్‌ కమాండోలతో వలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సొంత జిల్లా విశాఖలో మంత్రి పర్యటించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కొద్దినెలల క్రితం మావోయిస్టులు ఏజెన్సీలో కాల్చిచంపిన విషయం తెలిసిందే. నల్ల దుస్తులు ధరించిన కమాండోలు మంత్రి వాహనం వెంటన నిత్యం ఉంటారు.

దీంతో పాటు మంత్రి శ్రవణ్ వెంట ఎప్పుడూ నలుగురు గన్ మెన్స్ ఉంటారు. ప్రధానంగా సొంత జిల్లా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మంత్రి పర్యటన సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తారు. సూర్తి బులెట్ ఫ్రూఫ్ వాహనంతోపాటు మరో రెండు వాహనాల శ్రేణి మధ్య మంత్రి పర్యటించేలా ఏర్పాట్లు చేశారు.

శ్రవణ్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ అధికారిని కూడా ఏర్పాటు చేసింది. ఇకనుంచి శ్రవణ్ పర్యటనల్లో నల్ల దుస్తులు ధరించిన కమాండోలు కూడా ఆయన వెంట వెళ్లనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -