ఆచార్య మూవీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ లెంత్ పాత్రల్లో కలిసి నటిస్తున్న మూవీ ఆచార్య. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. గత ఏడాదిగా ఈ మెగా మల్టీ స్టారర్ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా ఇదే బాటలో ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ‘ఆచార్య’ సినిమాకి రేట్లు పెంచుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

- Advertisement -

హీరోల రెమ్యునరేషన్స్ మినహాయించి… సూపర్ హై బడ్జెట్ క్యాటగిరీలో పది రోజులు పాటు 50 రూపాయల అదనపు ధరలు పెంచుకునే విధంగా ఏపీ సర్కార్ కొత్త జీవోను విడుదల చేసింది. చూడాలి మరి ఆచార్య తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో.

ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆలియా

పుష్ప 2లో బాలీవుడ్ సీనియర్ హీరో

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -