జగన్ సర్కార్ లెక్కలు చూపడం లేదా ?

ఆంద్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జగన్ సర్కార్ తీసుకుంటున్న అప్పులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అప్పుల విషయాన్ని వేలెత్తి చూపించింది. ఇక ఏపీ లో పెరుగుతున్న రుణభారం దృష్ట్యా ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇక ఆర్బీఐ కూడా ఆంధ్ర ప్రదేశ్ అప్పుల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం వీటన్నిటిపై ఏంపట్టనట్టుగానే వ్యవహరిస్తోంది.

ఇక తాజాగా మరో కేంద్ర సంస్థ కాగ్ జగన్ సర్కార్ పై వేలెత్తి చూపించింది. ఏపీకి సంబంధించిన 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అయిదు నెలలు గడుతున్న బడ్జెట్ ఖర్చు వివరాలను ఎందుకు తెలపడం లేదని కాగ్ జగన్ సర్కార్ ను ప్రశ్నించింది. జనవరి నెల మరియు ఏప్రెల్ నెల కు సంబంధించిన వివరాలు మాత్రమే వెబ్ సైట్ లో ఉన్నాయని మిగిలిన నెలల యొక్క జమా ఖర్చు వివరాలు తెలపడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని నిలదీసింది.

దీంతో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ విషయంలో జగన్ సర్కార్ అవకతవకలు చేసిందని అందుకే వివరాలను వెల్లడించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక గత ఏడాది 2021-22 సంబందించిన రాష్ట్ర బడ్జెట్ ఖర్చు వివరాలు కూడా పెండింగ్ లేనే ఉన్నాయట. మరి అభివృద్ది పథంలో ఏపీ కి తిరుగులేదని చెబుతున్నా జగన్ సర్కార్ అభివృద్ది కి చేసిన ఖర్చు వివరాలను ఎందుకు తెలపడం లేదనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాకుండా సామాన్యుల నుంచి కూడా ఎదురౌతున్నాయి. మరి వీటిపై జగన్ సర్కార్ స్పందిస్తుందా ? లేదా శరమామూలే అని వదిలేస్తుందా అనేది చూడాలి.

Also Read

మోడీ తలుచుకుంటే.. జగన్ వెనక్కు తగ్గుతాడా ?

మోడీకి చెక్ పెట్టేందుకు కేజ్రివాల్ మాస్టర్ ప్లాన్ !

ఆ సర్వే ఫలితాలు జగన్ కు హెచ్చరికే ?

Related Articles

Most Populer

Recent Posts