Monday, April 29, 2024
- Advertisement -

జగన్ ప్రభుత్వానికి ఎసరు పెట్టిన ఉద్యోగులు !

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటింది. ఈ మూడున్నర సంవత్సరాలలో ఇచ్చిన హామీలలో 90 శాతం నెరవేర్చమని జగన్ సర్కార్ ఢంఖ బజాయించి చెబుతోంది. అయితే ఎంతవరకు హామీలు అమలు చేశారు అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. కొన్ని అసలైన హామీలను మాత్రం జగన్ గాలికి వదిలేశారనే వార్తలు వస్తున్నాయి. వాటిలో మద్యపాన నిషేదం, సిపిఎస్ రద్దు వంటి హామీలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు తమ ప్రభుత్వం రాగానే సంపూర్ణ మద్యపాన నిషేదం తథ్యం అని చెప్పిన జగన్.. ఆ తరువాత మద్యపానంపై ఎన్నో ప్రయోగాలు చేసి.. చివరకు నిషేదం అనే మాటనే మర్చిపోయారు. .

తీరా ఇదేంటి అని ప్రశ్నిస్తే ” మద్యపాన నిషేదం ” అనే హమీనే తమ మేనిఫెస్టోలో లేదని చెప్పి ఏపీ ప్రజానీకానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఇక ఉద్యోగుల విషయంలో కూడా సిపిఎస్ రద్దు చేస్తామని, ఎన్నికల ముందు హమీ ఇచ్చిన వైఎస్ జగన్. దాంతో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దానిపై జగన్ హమీ ఇవ్వడంతో.. నమ్మి ఓట్లు వేశారు ప్రభుత్వ ఉద్యోగులు. తీర అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్ రద్దు అంశాన్నే పెక్కన పెట్టేసింది జగన్ సర్కార్. దీంతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టి ఇచ్చిన హమీ నెరవేర్చండి అంటూ డిమాండ్ చేసినప్పటికీ జగన్ సర్కార్ ఏ మాత్రం పట్టించుకోలేదు.

పలు మార్లు ఉద్యోగులతో చర్చలు జరిపిన ప్రభుత్వం, సిపిఎస్ రద్దు చేయడం అంతా ఈజీ కాదని, దీనిపై కమిటీలు వేశామని చెబుతూ దాటవేసే దొరణినే అవలంభిస్తోంది వైసీపీ ప్రభుత్వం. దీంతో ఉద్యోగుల్లో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక ఎన్నికలు మరో ఏడాదిన్నరలో జరగనుండగా ఈసారి ప్రభుత్వ ఉధ్యోగులు జగన్ సర్కార్ కు గట్టిగానే షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిన్నర సంవత్సరంలో ఏదైనా జరగవచ్చు.. సిపిఎస్ ను ఎన్నికల ముందు రద్దు చేసి.. వచ్చే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం కూడా ఉంది. మరి సిపిఎస్ రద్దు పై జగన్ సర్కార్ వ్యూహాలు ఎలా ఉన్నాయో మరి.

ఇవి కూడా చదవండి

ఏపీలో మోడీ దోస్తీ ఎవరితో.. లైన్లో ముగ్గురు అధినేతలు !

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

షర్మిల అరెస్టుల మీద అరెస్టులు.. ఆమెకు లాభమే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -