బాబు ప‌నితీరును బ‌య‌ట పెట్టిన మంత్రి అఖిల‌ప్రియ‌…

 

AP tourisam minister Bhuma akhila Priya Comments on Chandra babu about Her Portfolio

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అంటె ముందుకు గుర్తుకొచ్చేది ఆయ‌న ప‌నితీరు. ఉద్యోగులంద‌రిని ప‌రుగుపెట్టించే పనిమంతుడై చంద్రబాబు చేతి కింద ఉన్న ఏ శాఖ అయినా మెరుగైన పనితీరు కనబరచడం ఖాయమే. త‌మ శాఖ‌ల్లో మంత్రుల ప‌నితీరుకు ర్యాంకులు ఇచ్చే బాబు త‌న కిందున్న శాఖను నిర్లక్ష్యం చేసే ఛాన్సే లేదన్న వాదన కూడా లేకపోలేదు.

మొన్నటి వ‌ర‌కు బాబు చేతిలో ఉన్న ప‌ర్యాట‌క శాఖ‌ను మంత్రివర్గ విస్తరణలో అఖిలను తన కేబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు… తన వద్ద ఉన్న పర్యాటక శాఖను ఆమెకు అప్పగించారు. విశాఖలో తన శాఖ ఉన్నతాధికారులతో ప్యాట‌క‌శాఖ‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.మీడియా ముందు అఖిల… బాబు పనితీరుకు పక్కా సర్టిఫికెట్ ఇచ్చేశారు. చంద్రబాబు చేతి కింద ఉన్న పర్యాటక శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆమె చెప్పారు.
నిర్ల‌క్ష్యం కార‌నంగానే రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించి ప్రభుత్వంతో 28 ఒప్పందాలు కుదరగా… ఇప్పటిదాకా ఒక్క ఒప్పందం కూడా కార్యరూపం దాల్చకపోవడమే ఇందుకు నిదర్శనమని కూడా ఆమె పక్కా కారణమే చెప్పారు. మొన్నటిదాకా తన శాఖ సీఎం ఆధ్వర్వంలో ఉండటమే ఇందుకు కారణమని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
ఈ విష‌యం చంద్ర‌బాబుకు ఎక్క‌డ తెలుస్తాదేమో అనుకున్న అఖిల మాట‌మార్చారు.పర్యాటక శాఖ బాధ్యతలను పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు నిత్యం బిజీబిజీగా ఉన్న నేపథ్యంలోనే తన శాఖ నిర్లక్ష్యానికి గురైందని ఆమె చెప్పుకొచ్చారు. మరి అఖిల చెప్పిన విషయం చంద్రబాబు చెవిన పడిందో లేదో చూడాలి. ఒకవేళ పడి ఉంటే… ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also read

  1. నిస్సిగ్గు ఫిరాయింపు నాయ‌కులా… జ‌గ‌న్ గురించి మాట్లాడేది…?
  2. టీడీపీకి భయం పట్టుకుంది.. అందుకే రంగంలోకి డిప్యూటీ సీఎం కేఈ
  3. చంద్ర‌బాబు ప‌రిస్థితితేంటి….?
  4. అఖిల‌ ప్రియ మంత్రి ప‌ద‌వి ఔట్‌…. ఆ స్థానంలో మ‌రో మంత్రి ఎవ‌రు…..?