Monday, May 12, 2025
- Advertisement -

బాల‌య్య… వ‌ర్సెస్… ప‌వ‌ణ్‌…? ఎవ‌రిద పైచేయి అవుతుంది…? టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడ్తాడా…?

- Advertisement -
Star War in Anantapur for 2019 Elections..?

2019 ఎన్నికల్లో అనంత‌పురం సంచ‌ల‌నాల‌కు వేదిక కానుంది. ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా సినీ గ్లామ‌ర్ ప్ర‌ముఖ‌పాత్ర పోషించ‌నుంది.ఇద్ద‌రు స్టార్‌హీరోల మ‌ధ్య నువ్వా నేనా అన్న ట‌గ్ ఆప్ వార్ జ‌ర‌గ‌నుంది.వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ ఒకే జిల్లా నుండి పోటీచేయనున్నారు.

దీంతో ఈ జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై మ‌రో స్టార్ ఏ మేరకు ప్రభావం చూపుతారనే ఆసక్తి నెలకొంది.

{loadmodule mod_custom,GA1}

మూడు రోజుల పర్యటనలో భాగంగా బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురంనుంచె పోటీ చేస్తాన‌ని నంద‌మూర న‌ట‌శింహం ప్ర‌క‌టించారు.అనంతపురం జిల్లా నుండే టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు పోటీచేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ ఒకే జిల్లా నుండి పోటీచేయనుండంతో ఆస‌క్తి నెల‌కొంది.
వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుండే పోటీచేస్తానని సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. గుడివాడ, మైలవరం నుండి పోటీ చేస్తానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలు నిరాధారమన్నారు. హిందూపురం పట్టణానికి రూ.198 కోట్లతో హంద్రీనీవా నుండి పైపులైన్లు వేసి ఐదు నెలల్లోగా నీటిని అందించనున్నట్టు ఆయన ప్రకటించారు.
2019 ఎన్నికల్లో జ‌న‌సేన ఛీప్ ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ అనంత‌పురంనుంచే పోటీ చేస్తాన‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.అయితే ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీచేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.తెలుగు సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకే జిల్లానుండి పోటీచేయాలని నిర్ణయించుకోవడం రాజకీయాల్లో ఆసక్తిని కల్గిస్తోంది.

{loadmodule mod_custom,GA2}

అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోట.ప‌ర్య‌టాల ర‌వీంద్ర ఉన్న‌న్నాల్లు అక్క‌డ ఎదురులేదు.ఆయ‌న మ‌ర‌నించిన‌త‌ర్వాత‌కూడా మంచి ప‌ట్టుఉంది.ఇక బాల‌య్య‌కూడా అక్క‌డ‌నుంచే పోటీచేస్తున్నారు.నిన్న‌టి వ‌ర‌కు ఉన్న జేసీ సోద‌రులు టీడీపీలో చేరారు.అన్నింటి ప‌రంగా చూసుకుంటె టీడీపీనే కింగ్‌.కొత్త‌గా రాజ‌కీయంలోకి వ‌చ్చిన ప‌వ‌ణ్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడ్తాడా అన్న‌ది వేచి చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}j2yd3DwsVsg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -