- Advertisement -
భద్రాద్రిలో ఏప్రిల్ 15న శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి.. శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. భద్రాద్రి రాముడి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రతి భక్తుడు కల్యాణాన్ని వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విఐపీలను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో ట్రాఫిక్ సమస్య రాకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.