Monday, April 29, 2024
- Advertisement -

ఏపీపై కన్నేసిన తెలంగాణ ఎమ్మెల్యే

- Advertisement -

2014 ఎన్నికల్లో తెలంగాణలోని భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సున్నం రాజయ్య. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ అంతటా టీఆర్ఎస్ జయకేతనం ఎగురేసింది. అంతటి ప్రభంజనంలోనూ కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఖమ్మం జిల్లా భధ్రాచలంలో సీపీఎం విజయం సాధించింది. 1967 నుంచి అక్కడ 11 సార్లు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి. ఆ 11 సార్లులో 8సార్లు సీపీఎం సత్తా చాటింది. 2014లోనూ సీపీఎం తరఫున భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సున్నం రాజయ్య టీడీపీ అభ్యర్ధి ఫణీశ్వరమ్మపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సీపీఎం నుంచి విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా సున్నం రాజయ్య నియోజకవర్గ సమస్యలపై గట్టిగానే పోరాడారు. అసెంబ్లీలో ప్రతిసారి తమ సస్యలను ఏకరవు పెట్టారు. ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వెళ్లాలన్నా, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్నా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. అందుకే ఆయనకు మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే హోదాలో ఆర్టీసీ బస్సులో తిరుగుతున్న అసలైన కమ్యూనిస్ట్ అంటూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తన నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాలు తర్వాత, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన 7 మండలాలతో పాటు ఏపీలో కలిసి పోయాయని రాజయ్య అసెంబ్లీలో గుర్తు చేసేవారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్లు ప్రస్తుతం ఏపీలో కలిసిపోయారని, తాను తెలంగాణ ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పేవారు. అందుకే తనకు అటు ఏపీ అసెంబ్లీలోనూ, ఇటు తెలంగాణ అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేగా గుర్తించి, అవకాశమివ్వాలని కోరేవారు.

అయితే వచ్చే ఎన్నికల్లో సున్నం రాజయ్య ఏపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేతో పాటు సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆ బాధ్యతల పదవీకాలం ముగిసినట్లు తెలిసింది. త్వరలో ఎమ్మెల్యే పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో 2019లో తాను ఏపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఎందుకంటే ఆయన స్వగ్రామం విభజన తర్వాత జరిగిన 7 మండలాల విలీనంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సున్నంవారి గూడెం వరరామచంద్రాపురం రంపచోడవరం నియోజకవర్గంలో విలీనమైపోయింది. దీంతో రాజయ్య 2019లో సీపీఎం తరఫున రంపచోడవరం నుంచి బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారట. అందుకు గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. ఇదే జరిగి ఆయన అక్కడ కూడా విజయం సాధిస్తే, రాష్ట్ర విభ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా రికార్డులకెక్కడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -