Wednesday, May 8, 2024
- Advertisement -

నేడు సీతారాముల కల్యాణం.. కానీ..

- Advertisement -

గత ఏడాది కరోనా విజృంభణ కారణంగా ఆలయాలు అన్నీ మూసి వేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలించిన తర్వాత తిరిగి ఆలయాలు తెరిచారు. కానీ ఇప్పుడు కరోసా సెకండ్ వేవ్ తో గత ఏడాది కన్నా ఉధృతి పెరిగింది. ఎంతగా అంటే.. దేశ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా బీభత్సం సృష్టిస్తుంది. దాంతో ఇప్పుడు నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ లు అమలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో అయితే ఏకంగా వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.

నేడు సీతారాముల కల్యాణం.. ప్రజలు తమ ఇష్టదైవం అయిన శ్రీరాముడిని సీతను కళ్లారా చూసుకునే భాగ్యం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. కరోనా కట్టడి నేపథ్యంలో ప్రజలు ఆలయాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. చాలా వరకు దేవాలయాలు మూసి వేశారు. లోక నాయకుడు, జగదభి రాముని కల్యాణం నేడు కన్నుల పండువగా జరగనుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో శ్రీసీతారాముల కల్యాణం అంతరంగికంగా నిర్వహించను న్నారు.

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం అభిజిత్ లగ్నం ప్రవేశించగానే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. కరోనా దృష్టా కేవలం 50 మంది విఐపిలతోనే శ్రీసీతాముల కల్యాణం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీసీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఇతర విఐపిలు హాజరు కానున్నారు.

శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే

ధర్మంబొక రూపంబున, సౌందర్యంబొక ఆకారంబూని నవమి నందు జనియించిన నవరాశులకధిపతివైన జానకీ రామ నీ పదములకు మ్రొక్కెదన్. సుమేధా మేధజోధన్య సత్య మేధా ధరా ధరః

శ్రేయోభిలాషులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
https://www.adya.news
https://www.adya.news/telugu
https://www.youtube.com/adyamedia
https://www.youtube.com/adyanews

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -