Monday, May 6, 2024
- Advertisement -

సూపర్ గ్లూ.. చిటికెలో గాయాలు మాయం !

- Advertisement -

మ‌న‌కు దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు అయ్యే గాయాలు మానేందుకు కొన్ని రోజులు నుంచి కొన్నివారాల స‌మ‌యం అయినా ప‌డుతుంది క‌దా! అయితే ఇక‌ముందు గాయ‌లు అయితే అంత స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. గాయం ఎక్కువైతే.. కుట్లు కూడా వేసే అవ‌స‌రం లేక‌పోవ‌చ్చు. అవును గాయాలు, పుండ్లు ఇక‌నుంచి త్వరగా మానిపోనున్నాయి.

అందుకోసం శాస్త్ర‌వేత్త‌లు ఒక అద్భుత‌మైన ఆవిష్కరణ చేశారు. ఆ ఆవిష్క‌ర‌ణ ఇప్పుడు అంద‌రిని ఆలోచింప‌జేస్తుంది. అమెరికాకు చెందిన బయో మెడికల్ ఇంజినీర్లు, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన సైటిస్టులు ఒక‌ సర్జికల్ గ్లూ ను అభివృద్ధి చేశారు. దీని‌కి మెట్రోగా పేరు పెట్టారు. దీన్ని గాయాల‌పై అప్లై చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ గాయాలు సీల్ అయిపోతాయి. దాంతో గాయం క్లోజ్ అయిపోతుంది.

ఈ గ్లూను అప్లై చేసిన త‌ర్వాత‌ అల్ట్రా వయొలెట్ కిరణాల సహాయంతో దాన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయ‌గానే ఆ గ్లూ పనిచేయడం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ గ్లూన్ ఇప్ప‌టికే ప‌లు ప‌శువుల మీద ప్ర‌యోగం చేశారు. ఆ ప్ర‌యోగాలు విజ‌య‌వంతం అయ్యాయి. త్వరలోనే దీన్ని మనుషులపై కూడా ప్ర‌యోగించ‌నున్న‌ట్లు ప‌రిశోధ‌కులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చెల్ చేస్తోంది.

కళ్ల కింద నల్లటి వలయాలు తొల‌గించుకోవాలా? అయితే ఇలా చేయండి..!

పట్టులాంటి జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి.!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -