Friday, April 19, 2024
- Advertisement -

కళ్ల కింద నల్లటి వలయాలు తొల‌గించుకోవాలా? అయితే ఇలా చేయండి..!

- Advertisement -

కాలంతో పాటు నేటి స‌మాజంలోనూ వ‌చ్చిన మార్పుల నేప‌థ్యంలో నిల‌క‌డ‌లేని ఉరుకుల ప‌రుగుల జీవితం నేడు న‌డుస్తోంది. దీనికి తోడు ఆధునిక టెక్నాల‌జీ వ‌చ్చిన విప్ల‌వాత్మ‌క మార్పుల‌తో జీవనశైలిలో నిత్యం ఫోన్లు, కంప్యూటర్లతోనే డ‌గ‌ప‌డం.. ఇక నిద్ర స‌మ‌యం కూడా త‌క్కువ‌గా కేటాయించుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో అనేక మార్పులు, అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా క‌ళ్ల కింద న‌ల్లటి చార‌లు, వ‌ల‌యాలు ఏర్ప‌డ‌టంతో ఎంత‌టి వారి అందాన్ని అయినా దెబ్బ‌తిస్తున్నాయి.

అయితే, అలాంటి వారు మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు రాసుకుని మ‌రిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవ‌డం కంటే నిత్యం ప‌లు ర‌కాలైన ప‌ద‌ర్థాల‌ను ఆహారంలో తీసుకోవ‌డంతో కళ్ల కింద ఏర్ప‌డే న‌ల్ల‌టి చార‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చున‌ని నిపుణులు వివ‌రిస్తున్నారు. ఆ వివ‌రాలు మీ కోసం..

కీరదోస‌లో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డంతో శ‌రీరంలోని వేడి త‌గ్గ‌డంతో పాటు చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే, ట‌మాటాల్లోనూ యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉండ‌టంతో పాటు ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి.. క‌ళ్ల కింద న‌ల్ల‌టి చార‌లు త‌గ్గేలా చేస్తాయి. విటమిన్-ఈ ఎక్కువగా లభించే బాదం, పీనట్స్, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తినడం వల్ల నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.

అలాగే, పుచ్చకాయ, క‌ర్జూజ పండ్లు తిన‌డం కూడా ఆరోగ్యానికి మంచిది. మ‌రీ ముఖ్యంగా ఇవి క‌ళ్ల కింద నల్లటి వలయాలు త‌గ్గించ‌డంతో ఉప‌యుక్తంగా ఉంటాయి. అలాగే, న‌ల్ల‌ద్రాక్ష‌, వివిధ ర‌కాల ఆకుకూర‌లు, బీట్‌రూట్, బొప్పాయి, నారింజ‌ను నిత్యం ఆహారంగా తీసుకోవ‌డంతో పాటు నీటిని సైతం అధికంగా తాగితే.. క‌ళ్ల కింద ఏర్ప‌డే న‌ల్ల‌టి చార‌లు త‌గ్గిపోతాయ‌ని నిపుణు పేర్కొంటున్నారు.

లవంగాలతో ఎంత ఆరోగ్యమో మీకు తెలుసా!

ఆప్రికాట్ తింటే చక్కటి ఆరోగ్యం!

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

అంజీర పండ్లతో చక్కటి ఆరోగ్యం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -