Thursday, May 2, 2024
- Advertisement -

డీఎండీకే అధినేత విజయకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్…!

- Advertisement -

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ కాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో చెన్నై లో కలకలం రేగింది. విజయకాంత్ చెన్నైలోని విరుగంబాక్కం లో నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగర పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. విజయకాంత్ ఇంట్లో బాంబు పెట్టామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్,పోలీస్ జాగిలం తో సహా విజయ కాంత్ నివాసానికి చేరుకున్నారు. ఆ ఇంటిని అంతా పరిశీలించారు. అయితే ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కావాలనే ఫేక్ కాల్ చేసినట్లు నిర్ధారించుకున్నారు.

Also Read: ఇక అక్కడ ఆలయాల్లో మహిళా పూజారులు

తమిళనాడులో సెలబ్రిటీల ఇంట్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్స్ తరచూ వస్తున్నాయి. కొన్ని నెలల కిందట హీరో అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు ఫోన్ రాగా పోలీసులు తనిఖీలు చేపట్టగా అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. ఇటీవల సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు పెట్టినట్లు ఫోన్ వచ్చింది. అది కూడా ఫేక్ కాలే. పోలీసుల విచారణలో ఓ బుద్ధిమాంద్యం యువకుడు ఫోన్ చేసినట్లు నిర్ధారించుకుని అతడి కుటుంబ సభ్యులను పిలిపించి హెచ్చరించి పంపించారు.

విజయకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఇలాగే బాంబ్ పెట్టినట్లు ఓ కాల్ వచ్చింది. పోలీసులు తనిఖీలు చేపట్టి ఎక్కడ బాంబు లేదని నిర్ధారించుకున్నారు. మళ్లీ అదే రోజు హీరో ధనుష్ ఇంట్లో కూడా బాంబు పెట్టి నట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే అందులో కూడా నిజం లేదని తేలింది. ఇలా వరుసబెట్టి తమిళనాడులో సెలబ్రిటీల ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

Also Read: కర్ణాటకలో సీఎం మార్పు మళ్లీ తెరమీదకు .. క్లారిటీ ఇచ్చినా ఆగని ఊహాగానాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -