Saturday, May 4, 2024
- Advertisement -

ఇక అక్కడ ఆలయాల్లో మహిళా పూజారులు

- Advertisement -

సాధారణంగా ఆలయాల్లో మగ పూజారులు ఉండటం తెలిసిందే. అయితే తమిళనాడులో త్వరలోనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మహిళా పూజారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆలయాల్లో పూజారులుగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపించే మహిళలకు సంబంధిత శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.

ఇందుకోసం కొత్త కోర్సును కూడా తీసుకువస్తోంది. దీనిపై రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ.. హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్నప్పుడు మహిళలకూ ఆ అవకాశం ఉంటుందని తెలిపారు.

సీఎం ఎంకే స్టాలిన్ అనుమతి తర్వాత మహిళలకు పూజారి శిక్షణ అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా కొనసాగిస్తున్నారు.. ఈ నేపథ్యంలో తమిళనాడులో మహిళా పూజారులు గా ఉండేలా సంచలన నిర్ణయం తీసుకోవడం పై అందరూ హర్షిస్తున్నారు.

కాంట్రాక్టర్‌పై చెత్త పోయించిన ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

చైనాలో పేలిన గ్యాస్​ పైప్​ లైన్.. 12 మంది మృతి

నితిన్ మనసు మళ్లీ మార్చుకోవాల్సి వచ్చిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -