Friday, May 9, 2025
- Advertisement -

సంపూర్ణేష్ బాబు కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!

- Advertisement -

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కారు ప్రమాదంకు గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమదం చోటు చేసుకునే సమయంలో కారులో సంపూతో పాటు ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. అందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్ర సిద్దిపేట్లో కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం (నవంబర్ 27) 11.30 గంటల ఈ ప్రమాదం జరిగింది.

అదృష్టవశాత్తు సంపూతో పాటు అయన భార్య పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడం తో అక్కడే ఉన్న స్థానికులో కార్లో ఉంది సంపూ అని గుర్తించి వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి సంపూ తో పాటు ఆయన భార్య, పిల్లలను తరలించారు. ఈ ప్రమదం పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలంకు పోలీసులు చేరుకుని పరిశిలీస్తున్నారు.

ఇక ఈ ప్రమాధంలో సంపూ కారు ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటివలే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టిసీ బస్సులను నడపడంపై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -