Friday, May 17, 2024
- Advertisement -

దాడితో మాకేం సంబంధం – చంద్ర‌బాబు

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం హత్యాయ‌త్నం జ‌రిగింది.విశాఖపట్నం విమానాశ్రయంలో జ‌గ‌న్‌పై దాడి జరిగింది. విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గుర్తుతెలియ‌ని వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో జ‌గ‌న్ భూజానికి స్వ‌ల్ప గాయాలైయ్యాయి.అయితే జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న గురించి స్పందించారు ఏపీం సీఎం చంద్ర‌బాబు. జగన్‌పై దాడి ఘటనను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

గురువారం నాడు అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనతో పాటు రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ తరహ ఘటనలను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు.ఇక జ‌గ‌న్‌పై దాడి చేసిన వ్య‌క్తి శ్రీనివాస్‌గా గుర్తించారు.ఇత‌నిది తూర్పు గోదావ‌రి జిల్లాగా స‌మాచారం అందుతుంది.శ్రీనివాస్ దాడిలో స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డ జ‌గ‌న్ ప్ర‌థ‌మ చికిత్స తీసుకున్న జ‌గ‌న్ వెంట‌నే హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -