Thursday, May 16, 2024
- Advertisement -

కోర్టుకు వెళ్లలేక.. ఇంకేం చేయలేక.. ఢిల్లీకి బాబు!

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లను ట్యాప్ చేశారని అంటూ ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇది అక్రమమంటూ కేసీఆర్ పై వారు విరుచుకుపడుతున్నారు. మరి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఘాటుగానే స్పందించింది. దమ్ముంటే ఈ వ్యవహారంలో తెలుగుదేశం వారు కోర్టుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర సమితి సవాలు విసిరింది.

మరి ఈ సవాలుకు ప్రతిస్పందించలేని స్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ. 

ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశం గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది. బాబు ఢిల్లీకి వెళ్లడానికే డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లి గవర్నర్ అధికారాల గురించి కేంద్ర హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తారట తెలుగుదేశం నేతలు.

పైకి ఇలా చెబుతున్నా.. అసలు అజెండామాత్రం కేంద్రం శరణు జొచ్చి.. కేసీఆర్ ను కంంట్రోల్ చేయడమే తెలుగుదేశం అధినేత ఉద్దేశం అని వార్తలు వస్తున్నాయి.ఎలాగూ భారతీయ జనతా పార్టీ వాళ్లు చంద్రబాబుకు మిత్రులే కాబట్టి.. వారు ఈ వ్యవహారంలో ఆయనకు అండగా నిలిచే అవకాశాలుండవచ్చు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని ఈ టేపుల తలనొప్పి నుంచి బయటపడటానికిచంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఒకవైపు ట్యాపింగ్ నేరమని.. దీనిపై  చర్యలు అంటూ.. చివరకు ఆపనేమీ చేయకుండా తెలుగుదేశం వారు ఢిల్లీని చేరుకొంటున్నారు. ఇక నుంచి ఈ వ్యవహారం ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -