Friday, March 29, 2024
- Advertisement -

ఆశ్చర్యం.. చికెన్​ లెగ్​పీస్​ రూ. 73 లక్షలు..!

- Advertisement -

ఇది వినడానికి అతిశయోక్తిగా అనిపించినా నిజం. చికెన్​ లెగ్​పీస్​ ఏకంగా రూ. 73 లక్షలకు అమ్ముడుపోయింది. మాంసాహారులకు చికెన్​ ఎంతో ఇష్టమైన పదార్థం. పైగా బడ్జెట్​లో అందుబాటులో ఉంటుంది. అంటే మటన్​తో పోల్చుకుంటే కాస్త తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఇక చికెన్​తో చేసే వెరైటీలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని వేల వెరైటీలు చేస్తారు. ఒక్క మనదేశంలోనే కాక.. అన్ని దేశాల్లోనూ చికెన్​ఇష్టపడే వారు ఉంటారు.

మనదగ్గర సాధారణంగా చికెన్​ కిలో రూ. 150 నుంచి రూ. 200కు దొరుకుతుంది. బాగా సీజన్​, డిమాండ్​ ఉంటే ఇంకాస్త పెరుగుతుంటుంది. కానీ ఏకంగా ఒక్క లెగ్​పీస్​ రూ. 73 లక్షలంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆ చికెన్​ లెగ్​పీస్​లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? దానికి ఎందుకంత ధర పెట్టారు. దాన్ని అంతధరకు కొన్నది ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: కళ్లను మాయ చేసే వీడియో.. ఆకు సీతాకొక చిలుకై ఎగిరిపోయింది..!

చికెన్​ పీసులు లాగించేవాళ్లకు.. మెక్‌‌డోనాల్డ్ చికెన్ తెలిసే ఉంటుంది. మెక్​డోనాల్డ్​ చికెన్​ పీసులు ఎంతో రుచిగా ఉంటాయి కూడా. అయితే మెక్​ డోనాల్డ్​ సంస్థ .. లెగ్​పీస్​ను వీడియో గేమ్​లోని ఓ పాత్ర ఆకారంలో తయారుచేసింది. ఆన్‌లైన్ గేమ్ ‘అమాంగ్ అస్’ అనే వీడియో గేమ్‌లోని క్యారెక్టర్ ఆకారంలో ఓ చికెన్​ లెగ్​పీస్​ను తయారుచేసింది. దీన్ని ఆన్​లైన్​లో అమ్మకానికి పెట్టగా.. ఓ వ్యక్తి మెక్‌డొనాల్డ్స్ చికెన్ నగ్గెట్ ఒకటి $ 99,997కు కొనుగోలు చేశాడు. అంటే మన కరెన్సీలో రూ. 73 లక్షలు. వామ్మో చికెన్​ పీస్ కోసం.. ఇంత రేటు కూడా పెడతారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

Also Read: నువ్వు బయట ఎంత తోపు అయినా కావచ్చు.. చిరుతను క్షణాల్లో ఈడ్చుకెళ్లిన మొసలి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -