సీతాకోక చిలుకలు ఎంతో అందమైనవి. వీటిని దేవతా రూపాలుగా కొలిచే వాళ్లు కూడా ఉంటారు. అందమైన సీతాకోకచిలుకలను చూస్తే.. ఎవరికైనా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చిన్నపిల్లలు వీటితో ఆడుకుంటుంటే సమయమే తెలియదు. చిన్నతనంలో ప్రతి ఒక్కరూ సీతా కోకచిలుకలతో ఆడుకొని ఉంటారు. ఇదంతా ప్రకృతి గొప్పతనం. ఇక సీతాకోక చిలుకల పూర్వపు రూపం గొంగళి పురుగులు. ఆ విషయం మనకు తెలిసినా.. సీతా కోకచిలుకలను మీద అసహ్యం మాత్రం కలగదు.
అయితే ఇప్పుడు సీతాకోక చిలుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ వీడియోలో ఏ ముందంటే.. ఓ వ్యక్తి ఎండిపోయిన ఆకులతో ఉన్న ఓ ప్రదేశంలో సంచరిస్తుంటాడు. అయితే అతడికి అక్కడ ఓ పండుటాకు ఎండిపోయిన ఆకు కనిపిస్తుంది. దాన్ని తన చేతుల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. అంతే ఆ ఆకు సీతాకోకచిలుకలా మారిపోయి.. ఎగిరిపోతుంది.
Also Read: నువ్వు బయట ఎంత తోపు అయినా కావచ్చు.. చిరుతను క్షణాల్లో ఈడ్చుకెళ్లిన మొసలి..!
ఇది ఆ వీడియోలోని దృశ్యం.
ఈ వీడియో చూసిన వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా కళ్ళను కూడా మాయ చేసే దృశ్యం. అందుకే ఈ వీడియో నెటిజన్లను ఈ స్థాయిలో ఆకర్షించింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. కొన్ని రకాల సీతాకోక చిలుకలు తమను తాము కాపాడుకొనేందుకు అప్పుడప్పుడూ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ సీతాకోకచిలుక సైతం ఆకు రంగులోకిమారిపోయిందన్నమాట. ఈ వీడియోను ఓ సారి చూడండి మరి.
Also Read: తొలకరి కురిస్తే అక్కడ వజ్రాల పంట.. ఇప్పుడక్కడ బంగారు గనుల తవ్వకానికి అనుమతి..!
