Wednesday, May 1, 2024
- Advertisement -

అఖండ నుంచి న్యూ పిక్​ .. ఫ్యాన్స్​కు మాంచి కిక్​..

- Advertisement -

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో అఖండ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్​ బంపర్ హిట్​ కావడంతో.. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏప్రిల్​ 13న ఈ చిత్రానికి సంబంధించిన.. టైటిల్ రోర్ విడుదలైంది. ఈ వీడియో యూట్యూబ్​లో రికార్డులు క్రియేట్​ చేసింది. అయితే ఈ సినిమాలో బాలయ్య .. అఘోరాగా నటిస్తున్నట్టు ఆ వీడియోలో చూపించారు. వీడియోలోని డైలాగ్ ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పించింది. ఈ సినిమాలో శ్రీకాంత్​ విలన్​గా, ప్రగ్యాజైస్వాల్​, పూర్ణ హీరోయిన్లుగా చేస్తున్నారు.

తాజాగా అఖండ టీం .. బాలయ్య మరో పిక్​ను విడుదల చేసింది. రేపు అంటే జూన్​ 10న బాలయ్య పుట్టినరోజు. ఇక ఒకరోజు ముందుగానే పిక్​ రావడంతో ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలకు డీపీగా పెట్టుకుంటున్నారు. టీజర్ కు భారీగా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లెజెండ్​లో జగపతి బాబు విలన్​గా చేసి ఎంతో పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక శ్రీకాంత్​ కూడా అటువంటి ప్రయోగమే చేయడం గమనార్హం.

Also Read : స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

తన బర్త్​డే వేడుకలకు ఎవరూ హడావుడి చేయొద్దని బాలయ్య ఇప్పటికే ఫ్యాన్స్​కు సూచించారు. తనను చూసేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటే .. అదే తనకు ఇచ్చే పెద్ద గిఫ్ట్​ అంటూ ఆయన మాట్లాడారు. మరోవైపు బాలయ్య.. స్టార్​ డైరెక్టర్​ గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడితోనూ సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాలేదు.

Also Read: కళ్యాణ్​రామ్​ తాడోపేడో తేల్చుకుందామనుకున్నాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -