Thursday, April 25, 2024
- Advertisement -

నువ్వు బయట ఎంత తోపు అయినా కావచ్చు.. చిరుతను క్షణాల్లో ఈడ్చుకెళ్లిన మొసలి..!

- Advertisement -

‘నువ్వు బయట ఎంత తోపైనా అయ్యి ఉండొచ్చు.. కానీ ఒక్కసారి నీళ్లలోకి దిగితే’ ఇది నేను లోకల్ సినిమాలో పోలీస్​ తో నాని చెప్పే డైలాగ్​. అందుకు నాని ‘గజేంద్ర మోక్షం’ లోని మొసలి, ఏనుగు కథను వివరిస్తాడు. అయితే సరిగ్గా అదే సీన్​ ఓ చోట జరిగింది. చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చిన ఓ చిరుతను .. ఆ నీళ్లల్లో ఉండే మొసలి లాగేసుకుపోయింది. క్షణాల్లో దాన్ని ఈడ్చుకెళ్లి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. ​

Also Read : హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

చిరుత పులి ఎంతో క్రూర జంతువు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్త గల సామర్థ్యం దాని కుంది. వన్య ప్రాణులను వేటాడి చంపడంలో దిట్ట. దాని వేగానికి ఏ జంతువైనా చిక్కాల్సిందే. అయితే చిరుతకు భూమి మీదే ఈ ఆటలన్నీ చెల్లెవి. నీళ్లలోకి వచ్చేసరికి అదేమంత బలమైన జంతువు కాదు. నీళ్లల్లో మాత్రం మొసలి కింగ్​.అలా ఓ మొసలి నీళ్లు తాగుతున్న ఓ చిరుతని క్షణాల్లో ఈడ్చుకెళ్లింది. చిరుత ఎంత గింజుకున్న లాభం లేకపోయింది. నిమిషానికే చంపేసింది.

ఈ ఘటన ఎప్పుడో ఆరు నెలల క్రితం జరిగింది. అయితే అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో రీట్వీట్ చేయడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవరో ఓ జంతు ప్రేమికుడు ట్విట్టర్​ లో ఈ వీడియోను పెట్టారు. ఓ చిరుత పులిని మొసలి క్షణాల్లోనే ఈడ్చుకెళ్లిపోయినట్టు అందులో కనిపిస్తుంది. ఈ వీడియో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే వైరల్​ గా మారింది. ఇప్పటికే లక్షల మంది ఈ వీడియోని చూశారు.

Also Read: తొలకరి కురిస్తే అక్కడ వజ్రాల పంట.. ఇప్పుడక్కడ బంగారు గనుల తవ్వకానికి అనుమతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -