నేపాల్ దుర్ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అక్కడెవరైనా భారతీయులు, తెలంగాణ పౌరులు ఇబ్బంది పడుతున్నారా అనే విషయంపై ఆరా తీయాల్సిందిగా సిఎంఒ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, రెవిన్యు శాఖ కార్యదర్శి మీనా తదితరులు ఎప్పటికప్పుడు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
నేపాల్‌లో జరిగిన భూకంపం వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లిన యాత్రికులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? అనే అంశాన్ని సిఎంఒ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం అధికారులు శనివారం మధ్యాహ్నం నేపాల్‌లో ఉండే భారత రాయబారి రంజిత్రేకు ఈ మేరకు లేఖ రాశారు. భూకంపం వల్ల తెలంగాణ ప్రాంతం వారికి ఏమైనా ఇబ్బందులు కలిగాయా?ఎవరైనా ఎక్కడైనా చిక్కుకుని పోయారా? యాత్రికులందరూ క్షేమంగానే ఉన్నారా? లాంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలపాల్సిందిగా కోరుతూ రాసిన లేఖను రంజిత్రే కు ఫ్యాక్స్ ద్వారా పంపారు.