ఆఫ్ఘన్ పై ప్రకృతి ప్రకోపం..!

- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైన భూకంప తీవ్రతకు 1000 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఖోస్త్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. భూపరితలం నుంచి 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లుగా యూరోపియన్ మేడిటేరియన్ సెస్మోలాజికల్ సంస్థ తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు నమోదయ్యాయి. పాకిస్తాన్, భారత్, వంటి దేశాలలో కూడా భూ ప్రకంపనలు నమోదైనట్లుగా సమాచారం.

ముఖ్యంగా అఫ్ఘానిస్తాన్ పక్తికా ఫ్రావిన్స్ లోని, నాలుగు జిల్లాలలో ఈ భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా మరణించారని, మరణాల సంఖ్య ఇంక పెరగొచ్చని, దాదాపుగా 1500 కి పైగా గాయపడ్డారని ఫక్తికా ఫ్రావిన్స్ సమాచార శాఖ అధికారి మొహ్మద్ అమీన్ వెల్లడించారు. గత రెండు దశాబ్దాలలో ఏదే అత్యంత ఘోరమైన డిజాస్టర్ భూకంపమని డిజాస్టర్ మేనేజ్మెంట్ డిప్యూటీ మినిస్టర్ శారపుద్దీన్ ముస్లిం అన్నారు. అయితే పాపం.. గత కొంత కాలంగా అఫ్ఘానిస్తాన్ పరిస్థితి అఘాచః ఘోచిరంగా ఉంది. నిన్న మొన్నటి దాకా తాలిబన్ల కారణంగా అతలాకుతలం అయిన ఆఫ్గన్.. .వారి అరాచక పాలనలో ఇంకా మగ్గుతూనే ఉంది. ఈ సందర్భంలో ఆఫ్ఘన్ పై ప్రకృతి కూడా కన్నెర్రజేయడం.. నిజంగా భాద కలిగించే విషయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

చైనా అమెరికా వార్.. కారణం ఆదేనా ?

శ్రీలంక .. గట్టెక్కేనా ?

పీకల్లోతు కష్టాల్లో పాక్.. దివాళా అంచున దేశం ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -