Thursday, April 25, 2024
- Advertisement -

ప్రపంచక‌ప్‌లో భూకంపం

- Advertisement -

అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా శనివారం ఐర్లాండ్-జింబాబ్వేల మ‌ధ్య మ్యాచ్ జరుగుతున్నది. జింబాబ్వే బ్యాట‌ర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐర్లాండ్ బౌలర్ మాథ్యూ హంప్రేయస్ ఐదో ఓవ‌ర్ ఐదో బంతిని వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ క్రమంలోనే మైదానంలో భూకంపం సంభవించింది.

దాదాపు 20 సెకెన్ల పాటు భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.2 గా న‌మోదైంది. కానీ మైదానంలో ఉన్న ఆట‌గాళ్లు ఎవ‌రికీ ఈవిష‌యం తెలియ‌దు. కానీ టీవీల ముందు మ్యాచులు చూస్తున్న క్రికెట్ వీక్షకులకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది. 20 సెకన్ల పాటు కెమెరాలు అటూ ఇటూ షేక్ అయ్యాయి. చివరికి కామెంటేటర్లు చెప్పడంతో అసలు విషయం అర్థమైంది. మైదానంలో భూకంపం సంభ‌వించింది అని.

ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ మైదానంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాగా ఈ మ్యాచులో జింబాబ్వేపై ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.4 ఓవర్లలో 166 పరుగులు చేసింది.అనంతరం బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ 32 ఓవ‌ర్ల‌తోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది.

క్రికెట్ వెన్నెముకను విరిచేస్తారా ..

భారత క్రికెట్ ను తలదించుకునేలా చేయకండి

బెదిరిస్తున్నారు చర్యలు తీసుకోండి టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ఫిర్యాదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -