Thursday, May 2, 2024
- Advertisement -

భూకంపాలు ఏ ప్రాంతాల్లో వస్తాయి, సేఫ్ ప్లేస్ ఏదీ ?

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు భారత దేశంలో సైతం ప్రకంపణలు సృష్టించాయి. ఇండియాలోని జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భూకంపాలు సంభవించాయి. అయితే భారత్‌లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందా ? ఉంటే ఏ ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి, సేఫ్ ప్లేస్ ఏదీ ? భారత్‌ను భూకంపాల బెడద భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇటీవల ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. వరుసగా ప్రకంపణలు సంభవిస్తోన్న నేపథ్యంలో భూగర్భ నిపుణులు స్పందించారు. భారత్‌లో భూకంప తీవ్రత అధికంగా ఉండే అవకాశం లేదని నిపుణులు తెలిపారు.

భూకంపం భూగర్భంలోని పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడుతాయని అధికారులు తెలిపారు. భారత ఉపఖండం ఇండియన్ ప్లేట్‌పై ఉంది. దీన్నే ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ ఉత్తరం వైపునకు ఏడాదికి 49 మిల్లీమీటర్ల చొప్పున కదులుతుంది. అలా కదిలినప్పుడు ఎగువన ఉన్న యూరోషియన్ ప్లేట్‌ను ఢీకొంటుందని, ఈ రెండు పలకాలు ఢీకొనడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని నిపుణులు తెలిపారు. భూకంప కేంద్రం దాదాపు హిమాలయాలకు సమీపంలో ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో భారత దేశంలోని హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని, భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇటీవల జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించినట్లు భూగర్భ నిపుణులు తెలిపారు. అయితే భూకంప కేంద్రం భూగర్భంలో ఎంత లోతులో ఉంటే.. తీవ్రత అంత తక్కువగా ఉంటుంది తెలిపింది.

దక్షిణ భారత దేశంలో భూకంపాలకు అవకాశం లేదని నిపుణులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా ప్రాంతాలు ఉన్నాయని ఆయా రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపణలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రల్లో సైతం భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన భద్రాచలం, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఉండగా.. ఏపీలో రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో భూమి కంపించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు భద్రాచలం ప్రాంతంలోని గోదావరి లోయతో పాటు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని పినపాక, గుండాల, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు మండలాలు, ఏపీలోని ఒంగోలు ప్రాంతంలోని గుండ్లకమ్మ, విజయనగరంలోని గరివిడి, నెల్లిమర్ల మండలాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6 దాగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు అంత సేఫ్ కాదని నిపుణులు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -