స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

- Advertisement -

ఈ ఎన్నికల్లో  ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు.. ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చాక జగన్ రాష్ట్రంలో చేసిన పనులు భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకుని చేసినవే.. ఇప్పుడు ఆ పనులు చేస్తే వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్ లో ఆ పనితనం తప్పకుండా తెలుస్తుంది..

పరిశ్రమల విషయంలో ఆచితూచి అడుగులు వేశారు జగన్.. ముఖ్యంగా స్థానిక సంస్థల విషయంలో ఎంతో క్లారిటీ గా వ్యవహరించారు.. రాష్ట్ర అభివృద్ధికి మూలాలు స్థానికంగానే ఉంటాయ‌ని బ‌లంగా నమ్మి స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు జగన్.. ఇది ఎందరో మేధావులు తేల్చిన నిజం.. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో గ్రామ స్వ‌రాజ్యానికి శ్రీ‌కారం చుట్టిన జ‌గ‌న్.. తాజాగా కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోద‌ని, ఆ డబ్బును అక్కడే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఖర్చు చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

- Advertisement -

దీనిపై ఇప్పటికే జగన్ చాలా సూచనలు అధికారులకు అందజేయగా మున్సిపాలిటీ ఆదాయం ఎంత? వ్యయం ఎంత? జీతాల కోసం, అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్‌ఓపీ రూపొందించి.. దానిక‌నుగుణంగా ముందుకెళ్లాల‌ని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవ అందించేందుకు ఇప్పటివరకు సంక్షేమ పథకాల్లో తన మార్క్ పాలనను చూపించిన జగన్ ఇక ఇప్పుడు అభివృద్ధి లో తనదైన స్టైల్ ను చూపిస్తూ ముందుకు వెళుతున్నాడు..

చంద్రబాబు కు జగన్ అంటే ఎందుకింత అసూయా…!

జనాల్లోకి జగన్.. బాబు ఇంటికేనా..?

ఈ విషయంలో జగన్ వెనకపడిపోయాడే..?

జగన్ తన తండ్రి లా పేరు తెచ్చుకోనున్నాడా..?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...