Friday, March 29, 2024
- Advertisement -

ఈ విషయంలో జగన్ వెనకపడిపోయాడే..?

- Advertisement -

ఎంత వత్తిడి లో ఉన్నా ఎలా నెగ్గాలో జగన్ నుంచి అందరు నేర్చుకోవాల్సిన విషయం. ఓ ఎనిమిది సంవత్సరాల ముందు జగన్ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అందరికి తెలిసిందే.. ఓ వైపు తండ్రి మరణం, మరి వైపు కేసులు, ఇంకో వైపు అప్పుడే పుట్టిన పార్టీ భాధ్యతలు ఇవన్ని జగన్ కి ఒకేసారి ముంచుకు రావడంతో అయన ఎలా తట్టుకుని నిలబడతారో అని అందరు అనుకున్నారు.. కానీ జగన్ వాటిని అధిగమించి ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎదిగారు..  తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలకు నిరూపిస్తే చాలు అని ప్రజల్లోకి వెళ్లి మరీ తనని తాను కాపాడుతున్నాడు..

ఇక ముఖ్యమంత్రి అయ్యాక జగన్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని అయన అడుగుజాడల్లో నడుస్తున్నానని అయన చాలా సందర్భాల్లో చెప్పారు.. ప్ర‌తీ చిన్న విష‌యంలోనూ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డినే ఆద‌ర్శంగా తీసుకుంటారు జ‌గ‌న్‌. తండ్రి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి, తండ్రి పేరు చెప్పి ఓట్లు తెచ్చుకుని, ఆ త‌ర‌వాత అధికారంలోకి వ‌చ్చాక కూడా.. ప్ర‌తీ ప‌థ‌కంలోనూ, ఆ ప‌థ‌క ప్ర‌చారంలోనూ వైఎస్ పేరుని వాడుకుంటూ – ఒక్క విష‌యంలో మాత్రం తండ్రిని అనుస‌రించ‌లేక‌పోతున్నారు అనిపిస్తుంది..

ఇటీవలే ఓ చానల్ లో వచ్చే ఓ కామెడీ షో లో జగన్ వేషం వేస్తూ ఓ చిన్న కామెడి పాత్రధారి జగన్ వేషం వేశారు.. అయితే దీన్ని జగన్ ఫ్యాన్స్ వేరేలా రిసీవ్ చేసుకున్నారు.. నిజానికి అది చాలా చిన్న స్కిట్టు. అందులో జ‌గ‌న్ పాత్ర‌ని ఇమిటేట్ చేసింది కొన్ని నిమిషాలు. ఈ మాత్రం దానికే… జ‌గ‌న్ అభిమానుల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. న‌టీన‌టుల‌కు, ఈ షోలో పాల్గొన్న మిగిలిన వాళ్ల‌కూ.. శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి తనపై శివారెడ్డి అనే మిమిక్రి ఆర్టిస్ట్ తనపై చేసిన కామెడీ ని ఎంతో ఆహ్లాదంగా స్వాగతించారు.. కనీ జ‌గ‌న్ లో, ఆయ‌న అభిమానుల్లో ఈ విషయంలో తండ్రిలా ఎందుకు స్పోర్టివ్ గా తీసుకోవట్లేదు అని కొంతమంది ప్రశ్న..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -