Tuesday, May 21, 2024
- Advertisement -

కాపు రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్…

- Advertisement -

కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో కాపు రిజర్వేషన్లు రాజకీయాలను ఓకుదుపు కదుపిన సంగతి తెలిసిందే. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష టీడీపీతో పాటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్రంగా మండిపడుతూ జగన్ కు లేఖ రాజిన సంగతి తెలిసిందే. దీంతో దిద్దిబాటు చర్యలకు దిగారు జగన్.

కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఉన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఇవాళ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ కేంద్రం రాసిన లేఖ అంశాన్ని ఈ సందర్భంగా జగన్‌ ప్రస్తావించారు. కాపులను బీసీల్లో చేర్చాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా..? అంటూ లేఖలో కేంద్రం స్పష్టత కోరిందని నేతలు గుర్తు చేశారు. కాని అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రం లేఖకు సమాధానం ఇవ్వలేదని జగన్ తెలిపారు.

చంద్రబాబు కాపు రిజర్వేషన్ల ను రాజకీయ అంశం గానే చూసారని ఆరోపిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ పై కోర్టులు తేల్చాల్సి ఉందన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. EWS రిజర్వేషన్ల లో రాష్ట్రాలు కులాల వారీగా కేటాయింపు పై స్పష్టత రావాల్సి ఉందన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు సోము వీర్రాజు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -