బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దం అయింది. బిగ్‌బాస్ రెండవ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. ఈ రెండు ఎలిమినేషన్స్‌లో భాగంగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన కామన్ మ్యాన్స్‌నే బయటికి పంపిచారు. షోలోకి కామన్ మ్యాన్స్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజన, నూతన నాయుడు షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక షోలో కామన్ మ్యాన్‌గా మిగిలింది గణేష్ ఒక్కడే. ఇతను ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నాడు.
ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా అతనికే ఎక్కువ ఎలిమినేషన్ ఓట్లు పడ్డాయి. దీంతో ఈ వారంలో ఎలిమినేట్ అయేది గణేష్ అనే అనుకుంటున్నారు. అతనితో పాటు ఈ వారం ఎలిమినేషన్స్‌లో తేజశ్వీ, గీతా మాధురి, భాను, కిరీటి వీరు కూడా ఎలిమినేషన్స్‌లో సెలెక్ట్ అయ్యారు. ఇంతమంది ఉన్నా ఈ వారం ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఇద్దరికే ఉంది. ఒకరు కామన్ మ్యాన్ గణేష్,రెండు కిరీటి. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు. షోలో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్లు కామన్ మ్యాన్సే కాబట్టి నెస్ట్ ఎలిమినేషన్ కూడా కామన్ మ్యాన్ అనే అనుకుంటున్నారు. గణేష్ షోలో పెద్దగా ఆకట్టుకోవడం లేదనే విమర్శ ఉంది.
ఇక రెండు కిరీటి,ఇతను బిహేవియర్ బాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ మాటలు అక్కడ,అక్కడ మాటలు ఇక్కడం చెప్పి గొడవలు పెడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్‌బాస్ నుండి బయటికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి. ఇప్పటికే షో నుండి ఇద్దరు కామన్ మ్యాన్స్‌నే ఎలిమినేట్ చేయడంతో బిగ్‌బాస్‌పై విమర్శలు వస్తున్నాయి .బిగ్‌బాస్‌కి మంచి రేటింగ్ రావడంతో షో నిర్వహాకులు హ్యపీగా ఉన్నారు.ఇక నాని యాంకరింగ్‌పై ప్రశంసలు అందుతున్న సంగతి తెలిసిందే.