బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసారు

వివాహిత(26)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన సంఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

బిస్లరీ గ్రామానికి సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితురాలు జానక్పూర్ లోని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు లిఫ్ట్ ఇస్తామని ఆమెకు మాయమాటలు చెప్పి వాహనం ఎక్కించుకున్నారు. ఆతర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి, ఆమెతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసి పిదప అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.