Monday, May 6, 2024
- Advertisement -

వెల వెలబోతున్న బంగారం.. అదే బాటలో వెండి!

- Advertisement -

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా ఆడవారికి బంగారానికి అమితమైన అనుబంధం ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదంటే ప్రత్యేక సందర్భాల్లో బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. గత ఆరు నెలలుగా కరోనా నేపథ్యంలో శుభకార్యాలు పెద్ద ఎత్తున జరగకపోయినా.. బంగారం రేటు మాత్రం అమాంతం పెరుగుతూ వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పడిసి దిగిరావడం గమనార్హం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.20 తగ్గుదలతో రూ.51,920కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.20 తగ్గింది. దీంతో ధర రూ.47,590కు క్షీణించింది. గత ఏడాది జూలై-సెస్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత జూలై- సెప్టెంబర్ క్వార్టర్‌లో బంగారం డిమాండ్ ఏకంగా 30 శాతం క్షీణించింది.

ప్రస్తుత ఏడాది ఇదే త్రైమాసికంలో పసిడి డిమాండ్ 86 టన్నులుగా నమోదైంది. కరోనా వైరస్ ప్రభావం, బంగారం ధర ఆకాశాన్ని తాకడం వంటి అంశాలు డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

‘మిస్‌ ఇండియా’… ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ

టాలీవుడ్‌ లో క్రికెట్ ఆడే టాప్ 10 హీరోలు వీరే..!

ప్రజల కష్టాలు దగ్గరుండి చూశారు.. ఆయన ఓ చరిత్ర

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -