Friday, April 26, 2024
- Advertisement -

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

- Advertisement -

మార్చి నెలలో మొదలైన కరోనా కేసులు ఇప్పటికీ వదలడం లేదు. ఇప్పటికే మూడు నెలల పాటు కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచారు. ఈ మద్య సడలించిన తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. మార్చి నెల నుంచి విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. అయితే ఈ మద్య పాఠశాలలు తెరుచుకునే యోచన చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు తెరుచుకునేందుకు సిద్దమైనాయి. అయితే పాఠశాలలు తెరిచిన తొలి రోజే ఓ స్కూల్లో కలకలం రేగింది.  స్కూళ్లలో సరైన ఆరోగ్య పరీక్షలు జరగడం లేదని తెలుస్తోంది.

కాగా, కేవలం శానిటైజ్, మాస్కులతో కరోనాను అడ్డుకోవడం సాధ్యం కాదని  తేలిపోయింది.  అల్మోరా లో కరోనా వైరస్ సోకిన 12వ తరగతి విద్యార్థికి ఆ లక్షణాలు కనిపించకపోవడంతో నేరుగా తరగతి గదిలోకి వచ్చి కూర్చుకున్నాడు.  అయితే ఆ విద్యార్థి తండ్రి తన ఇంట్లో వారికి కరోనా వచ్చిందని అనడంతో అందరూ అవాక్కయ్యారు.

ఉపాధ్యాయులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లి పరీక్ష చేయించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. తరగతికి హాజరైన మొత్తం 15 మంది విద్యార్థులను హోం క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో  స్కూలంతా శానిటైజ్ చేసి, మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు అతడు ఇంట్లో చెప్పకుండానే స్కూలు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రచార ఆర్భాటాలు లేకుండా పోలవరం పనులు

మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్..?

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

రాజకీయ నేతల వార్ మధ్య పోలీస్ లు సఫర్ అవుతున్నారా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -