Sunday, May 5, 2024
- Advertisement -

ఉత్కంఠంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్..!

- Advertisement -

యావత్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ మొదలైంది. ఇప్పటికే 10 కోట్ల మంది అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. మరో 6 కోట్ల మంది ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అమెరికాను కరోనా భయం పట్టి పీడిస్తుండటంతో ముందస్తుగానే చాలామంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి భారతీయులు కూడా ముందస్తు ఓటింగ్‌లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందస్తు ఓటింగ్‌ను యాబ్సెంట్ బ్యాలెట్‌గా పిలుస్తారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది.

ఈ రోజు జరిగే ఎన్నికలతో ట్రంప్, జో బిడెన్‌ల భవితవ్యం తేలనుంది. హవాయి, టెక్సాస్ , మోంటానా రాష్ట్రాల్లో 2016 నాటికంటే ఎక్కవ మంది ఓటు వేశారు. నార్త్ కరోలినా, జార్జియా, న్యూ మెక్సికో, నెవాడా మరియు టేనస్సీ ఇప్పటికే రికార్డు స్థాయిలో  ఓటింగ్ శాతం నమోదైంది. ఈసారి పూర్తి ఫ‌లితాల ప్ర‌క‌ట‌న మాత్రం కొన్ని రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఈసారి పోస్ట‌ల్ బ్యాలెట్ల సంఖ్య పెర‌గ‌డం వ‌ల్ల‌.. వాటి లెక్కింపు ఆల‌స్యం అవుతుంద‌ని అధికారులు ఇప్ప‌టికే ఒక ప్రకటన చేశారు.  

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది తొలి ఫలితంవాస్తవానికి 2016 ముందు వరకు ఇక్కడ గెలిచిన అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. అయితే 2016ఎన్నికల్లో ఇక్కడ ఆ సెంటిమెంట్ మారింది. ఇక్కడ గెలిచిన హిల్లరీ క్లింటన్ కాకుండా ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు. 2016 ఎన్నికల సమయంలో ఈ నగరంలో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. వారిలో నలుగురు హిల్లరీ క్లింటన్‌కు, ఇద్దరు ట్రంప్‌కు ఓటు వేశారు.

వెల వెలబోతున్న బంగారం.. అదే బాటలో వెండి!

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -