Saturday, April 20, 2024
- Advertisement -

అందరికీ షాక్.. మనిషి ముఖాన్ని పోలిన సొరచేప…!

- Advertisement -

సాధారణంగా సొర చేప అనగానే షార్ప్ గా ఉండే ముక్కు నోటి నిండా భయంకరమైన పన్నులు.. దాని భారిన పడితే ఛీల్చి చండాడుతుంది. సొరచేప భారిన పడి ఎంతో మంది చనిపోయారు. సాధారణంగా మనం ఎన్నో కథల్లో మత్స్య కన్య గురించి చదివాం. ఇప్పటికీ మత్స్య కన్యలు ఉన్నాయని నమ్ముతుంటారు. అప్పుడప్పుడు అలాంటి చేపలు కూడా చూస్తున్నాం. కానీ మత్స్య కన్యలు ఉన్నాయన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా ఇండోనేషియాలో ఓ సొరచేప అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

తూర్పు నూసా టెంగారా ప్రావిన్స్ తీర ప్రాంతంలో వేటాడుతుండగా అబ్దుల్లా నూరెన్ అనే మత్స్యకారుడి వలకు భారీ సొరచేప చిక్కింది. దాని పొట్టను కోసి చూడగా అందులో మూడు చిన్న సొరచేపలు దర్శనమిచ్చాయి.  విచిత్రం ఏంటంటే అందులో ఓ చేప అచ్చం మనిషి ముఖాన్ని పోలినట్టు కనిపించింది. దాంతో  అబ్దుల్లా నూరెన్ విస్తుపోయాడు. తన జీవితంలో ఎన్నో సొరచేపలను చూశానని.. కానీ ఇలాంటి చేప మాత్రం మొదటి సారిగా చూశానని అంటున్నారు.

ఈ విచిత్ర సొరచేపను చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తుండడంతో అబ్దుల్లా ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ సొరచేపను కొనేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు.. కానీ అది అదృష్ట చేప అని అందుకే ఎవరికీ అమ్మబోనని అంటున్నాడు.  కాగా, దీనిపై జీవశాస్త్ర నిపుణులు స్పందిస్తూ, జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఇలాంటి జీవులు జన్మిస్తుంటాయని వివరించారు.

రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం జగన్ కీలక నిర్ణయం..!

నేడు లోటస్ పాండ్ లో విద్యార్థులతో షర్మిల సమావేశం!

బీజేపీ నేత విష్ణు ను టీడీపీ కి నాయకుడు శ్రీనివాసరావు లైవ్ లో చెప్పుతో దాడి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -