Thursday, April 25, 2024
- Advertisement -

రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం జగన్ కీలక నిర్ణయం..!

- Advertisement -

అగ్రవర్ణ పేద మహిళలకు చేయూత పథకం విస్తరించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘ఈబీసీ నేస్తం’కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లకు రూ.670 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ భేటీ​ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 45-60 ఏళ్ల మధ్య ఉన్న అగ్రవర్ణ పేద మహిళలకు సాయం అందిచనున్నట్లు మంత్రి పేర్నినాని వివరించారు.

లక్షా 43 వేల మంది లబ్ధిదారులకు 300 చదరపు గజాల్లో అపార్టుమెంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమెదం తెలిపింది. రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇళ్లకు ఇప్పటికే చెల్లించిన రూ.469 కోట్లు వెనక్కివ్వాలని నిర్ణయించాం.

ప్రైవేట్‌ లే అవుట్లలో 5 శాతం భూమి పేదలకు కేటాయించేలా చట్ట సవరణకు కేబినెట్​ ఆమోదించింది. అనుమతి లేని లేఅవుట్ల కట్టడికి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. అనుమతి లేని లేఅవుట్లకు విద్యుత్, నీటికుళాయి ఇవ్వం’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఓటీటీలో దూసుకొస్తున్న ధనుష్ !

ర‌కుల్ సినిమా షూటింగ్ స్పాట్ పై రాళ్ల దాడి!

15యేళ్ల త‌ర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -