Friday, April 26, 2024
- Advertisement -

అమ్మవారి ముందు అక్రమాలు.. దుర్గగుడి లో దొంగల బడి..!

- Advertisement -

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అవినీతి నిరోధక శాఖ ఐదు రోజుల పాటు చేసిన తనిఖీల్లో.. అవినీతి, అక్రమాల డొంక కదిలింది. అ.ని.శా. అధికారులు దుర్గగుడిలోని కీలకమైన విభాగాలన్నింటిలోనూ లోతుగా పరిశీలించారు. కొండపై జరుగుతున్న లోపాలను గుర్తించి.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ప్రసాదాల కౌంటర్ల దగ్గర నుంచి ప్రారంభించి.. పరిపాలనా విభాగం వరకూ తనిఖీలు చేశారు. చీరలు విభాగం, ఇంజినీరింగ్‌, సరకులు.. ఇలా అన్నింటికి సంబంధించిన దస్త్రాలను లోతుగా పరిశీలించారు.

సెక్యూరిటీ, శానిటేషన్‌ టెండర్లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేశారు. ఆలయానికి వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులు, ఉత్సవాలు, సిబ్బంది పదోన్నతులు.. ఇలా ప్రతి విషయాన్ని పరిశీలించారు. రెండు కోట్ల రూపాయల విలువైన స్క్రాప్‌ను కేవలం 40లక్షల రూపాయలకే విక్రయించినట్లు అ.ని.శా. అధికారులు గుర్తించింది. ఆలయంలోని కొంతమంది కీలక సిబ్బందిని గొల్లపూడిలోని అ.ని.శా. కార్యాలయానికి పిలపించి.. ప్రశ్నించారు. అవకతవకలపై సంబంధిత సిబ్బందితో వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.

అ.ని.శా. ప్రాథమిక నివేదిక ఆధారంగా 13 మందిని సస్పెండ్‌ చేయాలంటూ దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు ఏడు విభాగాలకు చెందిన ఐదుగురు సూపరింటెండెంట్లు, ఎనిమిది మంది గుమస్తాలను దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు సస్పెండ్‌ చేశారు.దర్శనం టికెట్ల విక్రయాల్లో రికార్డ్ అసిస్టెంట్లు కె.రమేష్, పి రవికుమార్, ఫోటోల కౌంటర్‌ రికార్డు అసిస్టెంట్‌ పి.రాంబాబు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధరించారు. వారిని పర్యవేక్షించలేదంటూ సూపరింటెండెంట్‌నూ సస్పెండ్‌ చేశారు.

రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం జగన్ కీలక నిర్ణయం..!

నేడు లోటస్ పాండ్ లో విద్యార్థులతో షర్మిల సమావేశం!

బీజేపీ నేత విష్ణు ను టీడీపీ కి నాయకుడు శ్రీనివాసరావు లైవ్ లో చెప్పుతో దాడి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -