దేశమంతలో ఎక్కడ చూసినా బాహుబలి2 సినిమా పీవర్ నడుస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా బాహుబలి..బాహుబలి. .రోజుకో విధంగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.ఈ సినిమా పీవర్ రాజకీయాలల్లో కడూ ప్రవేశించింది. ఇప్పుడది వ్యాపార రంగానికి పాకింది.
తమ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు బ్యాంకులు వినూత్న ఆఫర్లతో ముందుకొస్తాయి. కానీ ప్రముఖ బ్యాంకింగ్ నెట్వర్క్ సంస్థ ఐసీఐసీఐ మాత్రం వినూత్న ప్రయత్నంలో ముందుకు వచ్చింది. బాహుబలి థీమ్‌తో డెబిట్ కార్డులను తీసుకొస్తుంది. ఐసీఐసీఐ ఖాతాదారులు బాహుబలి చిత్రంలో నచ్చిన ఫొటో లేదా డిజైన్‌ను ఎంపిక చేసుకొని వారు తీసుకోబోయే ఐసీఐసీఐ ‘ఎక్స్ప్రెషన్స్ డెబిట్ కార్డు’లపై వచ్చే విధంగా ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం ట్విటర్ ద్వారా వెల్లడించింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ గత నెల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లోను అత్యధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తుంది.ఈ బాహుబలి పీవర్ ఇంకా ఎన్నిరంగాలలోకి దూసుకుపోతోందోచూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
