Monday, May 13, 2024
- Advertisement -

టూవీల‌ర్ అమ్మ‌కాల్లో.. భార‌త్ ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1

- Advertisement -
India overtakes China to become the world’s largest two-wheeler market

ద్విచ‌క్ర వాహ‌న‌రంగంలో భార‌త‌దేశం చైనాను అధిగ మించి ప్రంపంచంలో నెంబ‌ర్ 1 స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్‌ఫ్యాక్చరర్‌ నివేదిక ప్రకారం 2016లో భారత్‌లో 17.7 మిలియన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించింది.

చైనాలో వీటి అమ్మ‌కాలు 16.8 మిలియ‌న్లుగా ఉన్నాయి.ప్ర‌ధానంగా ప‌ట్ట‌నాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఆదాయం మెరుగుపడటమే కాదు, మహిళలు కూడా వాహనాలపై ఆసక్తి చూపడంతో ఇది సాధ్యమైంది.హోండా కంపెనీ విష‌యంలో 35 శాతం మ‌హిళ‌లే ఉండ‌టం విషేసం.భారత్‌లో మొత్తం అమ్మకాల్లో స్కూటర్ల వాటా 5 మిలియన్లకు పైగా ఉండగా.. 100-110 సీసీ వాహనాలు సుమారు 6.5 మిలియన్లుగా ఉన్నాయి.కొన్నేళ్లుగా చైనాలో కార్ల అమ్మకం జోరుగా సాగడంతో ద్విచక్ర వాహనాల అమ్మకాలు మందగించాయి.
భారత్‌తో పోల్చుకుంటే చైనా టూవీలర్‌ మార్కెట్‌ పెద్దది. అయితే ఇటీవల ఆ దేశంలో ద్విచక్రవాహనాల అమ్మకాలపై పెట్టిన ఆంక్షలు, చౌకగా వస్తున్న కార్లు.. టూవీలర్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దీంతో అమ్మకాలు క్షీణించాయి. 2010లో చైనాలో ద్విచక్రవానాల అమ్మకాలు రికార్డు స్థాయిలో 27 మిలియన్లు దాటాయి. అయితే అనంతరం నాలుగేళ్లలో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కార‌నం ఎలక్ట్రిక్ బ్యాటరీ సాయంతో నడిచే వాహనాల అమ్మకం చైనాలో ఊపందుకుంది.ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలో ద్విచక్ర వాహనాల అమ్మకం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని హోండా మోటార్‌సైకిల్ అండ్ సెక్టార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా అన్నారు. భార‌త్ లో హోండా కంకంపెనీ వాహ‌నాల అమ్మ‌కంలో రెండో స్థానంలో నిలిచింది.
వాహ‌నాల కోనుగోలుకు రుణ సౌక‌ర్యం , కొత్త‌కొత్త మోడ‌ల్లు అందుబాటులోకి రావ‌డంతో ద్విచ‌క్ర‌వాహ‌నాల కొనుగోల్లు పెరిగాయి. ప్ర‌జ‌ల ఆదాయం కూడా పెర‌గ‌డంలో వాహ‌నాల‌పై ఎక్కు మ‌క్కువ చూపిస్తున్నారు.చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి పథకాలు, రహదారి నిర్మాణాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్ర‌భుత్వాలు ఖర్చుచేస్తుస్తున్నాయి.మౌలిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట వేస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. జియో కొత్త పథకం.. 100 శాతం క్యాష్ బ్యాక్
  2. త్వ‌ర‌లో శామ్‌సంగ్ ఎల్ట్రానిక్ కార్లు రాబోతున్నాయి…..
  3. త్వ‌ర‌లో స్టూడెంట్ ఎడిష‌న్ ల్యాప్‌ట్యాప్‌లు అందుబాటులోకి రానున్నాయి…
  4. 1500 వంద‌ల‌కే స్మార్ట్ పోన్‌…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -