ఈశాన్య రాష్ట్రాల్లో తొలి సారిగా పాగా వేసి అసోంలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రం మంత్రి శర్వానంద సోనూవాల్ మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సోనూవాల్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు బిజెపి విజయంలో ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్ నేత హిమంత బిశ్వాస్, మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సందర‌్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ నరేంద్రమోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలను అభివ్రద్ది చేసేందుకు కేంద్రం తమ వంతు సాయం చేస్తుందన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో అసోం ఎంతో వేగవంతంగా అభివ్రద్ధి సాధించి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అన్ని రంగాల్లోనూ అసోం ఎదిగేలా మేం చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు.