పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దాడికి పాల్పడిన వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు పాకిస్థాన్ పౌరులకు వీసా సేవలను రద్దు చేసింది కేంద్రం. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో క్యాబినెట్ భద్రతా కమిటీ తీసుకున్న నిర్ణయాల అనుసరణగా, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపిస్తున్నట్లు తెలిపింది.
2025 ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు ఇప్పటి వరకు జారీ చేసిన అన్ని వీసాలు అన్ని రద్దు చేసింది. వైద్య అవసరాల కోసం జారీ చేసిన వీసాలు మాత్రం 2025 ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి అని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు తమ వీసా గడువు ముగిసేలోపు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాలి అని తెలిపింది.
భారత పౌరులు పాకిస్తాన్‌కు ప్రయాణించకూడదు. ఇప్పటికే పాకిస్తాన్‌లో ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా దేశానికి తిరిగి రావాలని సలహా ఇస్తున్నాం అని తెలిపింది.