మోకాళ్ల లోతు మంచులో..గర్భిణీతో సైనికులు..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని కరల్​పురాలో ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న నిండు గర్భిణీకి సాయం చేసేందుకు సైనికులు ముందుకొచ్చారు. గర్భిణిని ఓ మంచంపై మోసుకెళ్లి 2 కిమీ దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. జననరి 5న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మోకాళ్ల లోతు మంచులో గర్భిణీని సైనికులు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిమపాతంలోనూ మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు సైనికులు చూపించిన ధైర్యసాహసాలను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -